Home  »  TV News  »  Brahmamudi:వెంకీకి తప్పని నిరాశ.. స్వాతి, ఐశ్వర్య మధ్య సరికొత్త వార్!

Updated : May 23, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1039 లో.. రాజు కోపంగా ఇంట్లో అందరిని పిలిచి నాకు ఆ రూమ్ ఇరుకుగా ఉంది. వేరే ఏసీ ఉన్న పెద్ద రూమ్ కావాలని డిమాండ్ చేస్తాడు. దాంతో సరే అని రేఖ అంటుంది. మా భ్రమరాంబ వదిన రూమ్ ఇస్తుందని రేఖ అనగానే ఆమ్మో నా రూమ్ ఆ.. నాకు అసలే మోకాళ్ళ నొప్పులు కిందపడుకోవడం నా వల్ల కాదు.. నేను ఇవ్వలేనని భ్రమరాంబ అంటుంది. పోని స్వాతి నువ్వైనా నీ గది ఇవ్వు అని రేఖ అనగానే లేదు వద్దు నా కూతురికి ఎగ్జామ్స్ ఉన్నాయి.. తనకి డిస్టబెన్స్ వద్దని భ్రమరాంబ అంటుంది. అవును అత్తయ్య నేను ఇవ్వనని స్వాతి అంటుంది.

అందరు ఇలా అంటే ఎలా అని రేఖ అంటుంది. ఐశ్వర్య నీ రూమ్ వాళ్ళకి ఇవ్వమని రేఖ అనగానే.. నాకు ఆ ఇందు అంటేనే ఇష్టం ఉండదు.. అలాంటిది నా రూమ్ ఎలా ఇస్తానని ఐశ్వర్య అంటుంది. ఏంటమ్మా నీకు ఇష్టం లేదా.. నువ్వు చేసిన పని తెలిస్తే అని రాజు అంటాడు. ఇప్పుడు గొడవ ఎందుకు ఐశ్వర్య ఇవ్వు అనగానే ఎక్కడ రాజు నిజం చెప్తాడోనని ఐశ్వర్య సరే అంటుంది. అదంతా చేస్తున్నా రాజు వంక ఇందు కోపంగా చూస్తుంది. మరొకవైపు వెంకీకి ట్రూ లవర్ ని సెర్చ్ చేస్తుంటుంది నందు. అందులో భాగంగా మరొక అమ్మాయి, వెంకీ కలిసేలా మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. అయితే ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయి ఉంటుంది. అయిన టైం పాస్ కోసమని వెంకీతో మాట్లాడుతుంది. అది తెలిసి.. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళమ్మా అని వెంకీ ఆ అమ్మాయితో అంటాడు. నాకు ట్రూ లవ్ ఈ జన్మ లో దొరకదని వెంకి డిస్సపాయింట్ అవుతాడు. మరొకవైపు ఐశ్వర్య తన రూమ్ ఖాళీ చెయ్యడానికి బట్టలన్నీ సర్దుతుంటే ఇందు వెళ్తుంది. నువ్వు ఇక్కడే ఉండు అని ఇందు అంటుంది. ఏంటి నాటకాలు ఆడుతున్నావా.. నువ్వు నీ మొగుడు కలిసి ప్లాన్ చేసి, ఇప్పుడు ఇలా అంటున్నావా.. నువ్వు మీ అమ్మలాగే అని ఐశ్వర్య కోప్పడుతుంది. రాజు బెడ్ పై పడుకొని హమ్మయ్య ఎంత బాగుందోనని అంటాడు. నిన్ను ఇదంతా ఎవడు చెయ్యమన్నాడు అని రాజుపై ఇందు కోప్పడుతుంది. నా చెల్లి ఐశ్వర్యకి నేను అంటే పడదు.. ఇంకా ఈ గొడవతో కోపం పెంచుకుందని ఇందు అనగానే ఆ విషయం వదిలియ్.. ఎంప్లాయిస్ కి శాలరీలు ఎలా ఇస్తావ్.. నాకు ఇస్తానన్న డబ్బు ఎలా ఇస్తావని రాజు అడుగుతాడు.

ఆ తర్వాత అసలు ఏం చేస్తున్నావ్..  ఆ రాజుగాడు చెప్పినట్లు నువ్వు వినడం ఏంటని రేఖతో భ్రమరాంబ అంటుంది. వాడిని మన గ్రిప్ లో పెట్టుకోవడానికి ఇదంతా అని రేఖ చెప్తుంది. మరొకవైపు స్వాతి రూమ్ కి ఐశ్వర్య తన బట్టలు పట్టుకొని వెళ్తుంది. నీ బట్టలన్నీ తీసేయ్ అని ఐశ్వర్య అనగానే రిక్వెస్ట్ గా అడుగు.. ఎక్కడ బట్టలు పెట్టాలో చెప్తానని స్వాతి అంటుంది. స్వాతి చదువుకుంటుంది.. ఐశ్వర్య లైట్ అఫ్ చేస్తుంది. ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ లాగా ఫైట్ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.